ఐవిఆర్ కృష్ణారావు ను పదవినుంచి తొలగించడం బ్రాహ్మణ జాతికి జరిగిన పరాభవం
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ఆగ్రహం
ఐవిఆర్ కృష్ణారావు ను పదవినుంచి తొలగించడం బ్రాహ్మణ జాతికి జరిగిన పరాభవం
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ఆగ్రహం
ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ చైర్మన్ గా అత్యుత్తమ సేవలందించిన ఐవైఆర్ కృష్ణారావు ను ఎలాంటి సంజాయిషీ కోరకుండా పదవి నుండి తొలగించడం అన్యాయమని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో అనుభవజ్ఙుడు, ఆంద్రప్రదేశ్ రాష్టం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలందించిన కృష్ణారావుకు
ఆంద్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ చైర్మన్ పదవిని కట్టబెట్టి ఫేసుబుక్కులో ఏదో కామెంట్లు పెట్టాడని ఎలాంటి సంజాయిషీ కోరకుండా తొలగించటం అవమానకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్య యావత్ బ్రాహ్మణ జాతిని అవమాన పరిచినట్టేనని వారు అన్నారు. ఇందుకు ఆంద్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ జాతికి క్షమాపణలు చెప్పడంతో పాటు ఐవైఆర్ కృష్ణారావుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు



No comments:
Post a Comment