Thursday, September 29, 2016

లోహియా గ్రూపు ఆద్వర్యంలో జల్ శుధ్

 లోహియా గ్రూపు ఆద్వర్యంలో జల్ శుధ్

పర్యావరణ పరిరక్షణ - చెరువుల సంరక్షణ లో భాగంగా లోహియా గ్రూపు ఆద్వర్యంలో చేపట్టిన జల్ శుద్ద్ కార్యక్రమం దుర్గం చెరువు వద్ద గురువారం చేపట్టారు.

సంస్థ ఎండీ మహావీర్ లోహియా డైరెక్టర్ మిథేష్ లోహియాలు  మాట్లాడుతూ తెలంగాణ లో బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకొని చెరువులను పరిశుద్ధంగా ఉంచేందుకు జలశుధ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నగరంలో ఏడు ప్రధాన చెరువులతో పాటు, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో తొమ్మిది చెరువులను ఎంచుకొని అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ వ్యాపారసంస్థలు లాభాపేక్షతో కాకుండా సామాజిక సేవా దృక్పథంతో కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. బతుకమ్మ పండుగ లో వాడే ప్రకృతి సిద్దమైన పూలలో కలుషిత జలాల శుద్దికి ఉపయోగపడే గుణాలు ఎన్నో ఉంటాయని అన్నారు.
అయితే చెరువులతో పాటు వాటి పరిసరాలు కూడా పరిశుబ్రంగా ఉండేలా ప్రజలలో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.

లోహియా మార్కెటింగ్ మేనేజర్ పిల్లుట్ల ఆనంద్ మోహన్  ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ప్రతినిధి శ్రీనివాస్, ఎన్జీవో ప్రతినిధులు దీక్షితులు, సంస్థ ప్రతినిధులు నారాయణరావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.





Wednesday, September 21, 2016

బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య





బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య

వివాహిత స్త్రీ ని వేదిస్తున్నాడన్న నెపంతో భవానీ మాలలో ఉన్న బ్రాహ్మణ యువకుడిపై స్థానికులు  దుర్భాషలాడుతూ దాడిచేయడంతో మనస్థాపానికి గురై ఇంట్లొ ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పేట్ బషీరాబాద్ : పేట్ బషీరాబాద్ పి.యస్ పరిదిలోని పద్మారావు నగర్ ఫేస్ 2 లో నారాయణ క్షేత్రం లో పూజారిగా విధులు నిర్వహిస్తున్న "వడపల్లి భాస్కర కృష్ణ స్వరూప్ (25) కాలని పెద్దలు అవమానించారని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..తండ్రి ఇచ్చిన ఫిర్యాధు మేరకు కాలని పెద్దల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు
విషయం తెలుసుకున్న వెంటనే గ్రేటర్ హైదరాబాద్ అర్చకసంఘం నాయకులు శ్రీకాంత్ శర్మ స్థానిక అర్చకసంఘం నాయకులు పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేయించారు.

మృతుని కుటుంబానికి న్యాయం జరిగేందుకు శవాన్ని నిందితులో ముఖ్యుడికి చెందిన పాఠశాలముందు పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

కార్యక్రమంలో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ 
గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్, భాగ్యనగర అర్చకసంఘం అద్యక్షులు శ్రీనివాసాచార్యులు కుత్భుల్లాపూర్ అర్చకసంఘం సభ్యులు, ఇతర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.


బ్రాహ్మణ జే. ఏ.సి.అవసరమా?


బ్రాహ్మణ JAC అవసరమా?
(బ్రాహ్మణ సంఘ పెద్దలకు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ప్రశ్న)

గత ఎన్నో సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఏర్పడ్డ బ్రాహ్మణ సంఘాలు మన సమాజానికి వారికి చేతనయిన సహాయసహకారాలను అందిస్తూనే ఉన్నారు.... ఉదాహరణకు బ్రాహ్మణ సేవా సంఘం, బ్రాహ్మణ పరిషత్తు, అర్చక పురోహిత సంఘం, బ్రాహ్మణ భవన్, బ్రాహ్మణ సమాజం, మనమంథని వారి సంఘం మరియు ఇతర ప్రాంతీయ బ్రాహ్మణ సంఘాలు, ప్రొఫెషనల్ బ్రాహ్మణ సంఘాలు ఇలా ఎన్నో సంఘాలు వారి వారి పరిధులలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సంగానికి వారికి తోచిన విధంగా సేవలో పాల్గొంటున్నారు.

మరి అలాంటప్పుడు JAC పేరున కొత్త సంఘం అవసరమంటారా? 

బ్రాహ్మణ JAC లేకుంటే ప్రభుత్వం కార్పోరేషన్ ఏర్పాటు చేయను అని తెలిపిందా... నిధులు కేటాయించము అని చెప్పిందా.... మరి అలాంటప్పుడు JAC ఎందుకు? 

మనసమాజంలో అందరూ ఒకేనాయకత్వాన్ని అంగీకరించకపోవచ్చు. దానికి కారణాలు అనేకం. 

ఎవరు మంచి కార్యక్రమం చేపట్టి పిలుపునిచ్చినా అందరం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.

ఎన్ని జెండాలు ఉన్నా అందరి ఎజెండాలు ఒకేవిధంగా ఉండేలా...అది బ్రాహ్మణ సమాజానికి ఉపయోగపడేలా సేవలు అందిద్దాం....

అంతేకానీ.... ఐఖ్యతలేని సమైఖ్య కార్యాచరణ వలన ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఏ ఒక్క సంఘాన్నో... వ్యక్తినో వ్యతిరేకించాలన్నది మా ఉద్దేశ్యం కాదు. 

JAC ల పేరుతో మన అనైఖ్యతను సమాజానికి ఎత్తిచూపడం అవమానకరంగా ఉంది. దీనివలన మనం సమాజంలో చులకన అవ్వడమే తప్ప మరొకటి లేదు. 

ఇప్పటికైనా పెద్దలు JAC ఆలోచన మానుకొని బ్రాహ్మణులమంతా భిన్న సంఘాలున్నా అంతా ఒక్కటే అని చాటిచెప్పుదాం....

JAC ఆలోచన విడనాడండి.... 
సేవకార్యక్రమాలను పెంపొందించండి.....
బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేద్దాం.... బ్రాహ్మణ సమాజ బలోపేతానికి నడుం బిగిద్దాం...
జై బ్రాహ్మిణ్.... జైజై బ్రాహ్మిణ్

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్...
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

Saturday, September 17, 2016

గీతా యజ్ఙం.... పుస్తకాల దాతలు



గీత చదువుకో.. రాత మార్చుకో...
భగవద్గీత అంటే ఏమిటి?

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?

– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?

– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?

– అది కేవలం హిందువులదా?

– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

కాదు. అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత 
‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’. 


☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?

 -ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
-కర్తవ్యం గురించి చెబుతుంది.
-కోరికలను తీర్చుకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
- ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 
-సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. 
-ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. 
-పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 
-ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. 
-స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 
-జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 
-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
 -ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 
-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 
-పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. 
-ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 
-కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
 -నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది.
-అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
-నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని చెబుతుంది.

అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.
అర్థం చేసుకున్నవారు ధన్యులు. 
వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు. 
నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

అందుకరె గీత చదువుకో..రాత మార్చుకో...

దయచేసి భగవద్గీతను చావులవద్ద, అంతిమయాత్రల వద్ద మాత్రమే వాడుతున్నారు.... ఇది భాదాకరం.... దీనిని మానుకుందాం.... ప్రతిఇంట్లో భగవద్గీతను చేర్చే ప్రయత్నాన్ని చేపడుదాం. అదే ఈ గీతా యజ్ఙం.....

అందుకే బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ చేపట్టిన గీతా యజ్ఙంలో పాల్గొనండి. మీకు చేతనైన సహాయం చేయండి. ఇంటింటికి గీత.... అదే మీరందించే చేయూత....

మీ సహాయసహకారాలకోసం ఎదురుచూస్తున్నాం....
మరిన్ని వివరాలకోసం సంప్రదించండి.
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
ఫోన్. నం. 9700007653.



గీతా యజ్ఙం.... దాతల వివరాలు


మనం చేపట్టిన గీతా యజ్ఙంలో బాగంగా మన సమూహ సభ్యులనుండి మంచి స్పందన లభించింది. 

దాతల వివరాలు.

1). తేది 11-09-2016న నిర్మల్ వాసి శ్రీ తల్లాప్రగడ వేంకట సుబ్బారావు గారు 1500/- విరాళం అందించారు. ఫోన్ నం. 9440011248.

2) వైజాగ్ వాస్తవ్యులు శ్రీ రామారావు గారు 1500/- తేది. 11-09-2016. పోన్ నం. 9985484477

3) శ్రీ ఎమ్. ఎల్. నరసింహారావు గారు 1500/- తేది 12-09-2016, ఫోన్ నం. 9440475490

4) ఎమ్. శ్రీధర్ కుమార్ గారు, చైతన్యపురి, 1500/- తేది 13-09-2016, ఫోన్ నం. 9030018622.

5) చక్రధర్ కౌశిక్ గారు రూ.లు. 1500/- తేది 13-09-2016, ఫోన్ నం. 9739990500

6) శ్రీ చల్లా కౌండిన్య శర్మ గారు 1500/- రూ తేది 14-09-2016, ఫోన్. నం 8884004400

7) శ్రీ రావినూతల శ్రీనివాస్, 1116/- తేది 15-09-2016
 ఫోన్ నం. 9032539410

8) శ్రీ శధర చంద్రారావు 1116/- తేది 15-09-2016 ఫోన్ నం. 9849028845

9) తేది 16-09-2016న నెల్లూరు వాస్తవ్యులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు రూ. లు 1500/- విరాళం ఇచ్చారు. ఫోన్ నం. 9986834561

10) తేది 16-09-2016న శ్రీ నేతి చక్రధర్ గారు రూ.లు 1500/- విరాళం అందించారు. ఫోన్ నం. 098494 51972

11) తేది 17-09-2016న శ్రీ కోట రవికుమార్ గారు. రూ.లు 1500/-, ఫోన్ నం. 800811379, 

12) తేది 17-09-2016న శ్రీ సాయి రామకృష్ణ గారు, రూ.లు 1500/- , ఫోన్ నం. 9618302803

మరియు వేద అకాడమీ ఓరుగంటి అనిల్ కుమార్ గారు 3000/- రూ.లు విలువచేసే (20/- రూ. ధరవి 150 పుస్తకాలు) పుస్తకాలను గీత ప్రెస్ లో కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపారు. 

 పై వారందరికి బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ తరపున హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేస్తున్నాము. 

వీరి ద్వార మరికొంతమంది స్పూర్తిపొంది ఈ యజ్ఙంలో భాగస్వామ్యులు కావాలని ఆశిస్తున్నాము.

మరియు మనమే స్వంతంగా పుస్తకాలు ముద్రించాలనే యోచనలో ఉన్నాము. కావున ఇట్టివిషయంలో ఎవరైనా సహాయసహకారాలను అందించదలుచుకుంటే 9700007653 నంబరుకు సంప్రదించగలరు.

మీ
గోగులపాటి కృష్ణమోహన్
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్

కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్