Tuesday, June 6, 2017

'అస్మిక యోగ తస్మిక భోగ' పాటను నిలిపివేయాలి.... బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్.


'అస్మిక యోగ తస్మిక భోగ' పాటను నిలిపివేయాలి....
          బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్.

 డిజె సినిమాలో పాటను తొలగించాలి

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్

దువ్వాడ జగన్నాధం సినిమాలో సినీగేయ రచయుత సాహితి అసందర్భ ప్రేలాపనలతో బ్రాహ్మణులను కించపరిచేగా  రాసిన పాటను తొలగించాలని, లేదంటే పెద్దయెత్తున ఆందోళనలు చేపడుతామని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు హెచ్చరించారు.

సినిమాలలో బ్రాహ్మణులను చాలా హీనంగా చూపడం సమర్పకులకు అలవాటుగా మారిందని. ఈ జాడ్యం ఇప్పుడు ఆ సినిమాల పాటలకు కూడా విస్తరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ జూన్ 23 న విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాధం’ సినిమాలో ‘సాహితి’ అనే చెరుకుపల్లి శ్రీరామచంద్ర మూర్తి రాసిన ‘అస్మిక యోగ తస్మిక భోగ’ అనే పాటలో ”ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం... ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’ అంటూ ప్రణయ గీతానికి రుద్ర స్తోత్ర పదాలను ఆపాదించి హిందువుల... అందులో ముఖ్యంగా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా ప్రవర అనేది రుషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించినదని, పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమని తాము పరిచయం చేసుకునేందుకు అభివాదం చేస్తూ గోత్ర ప్రవరలు ప్రస్తావించేవారని,  అటువంటి ప్రవరను అపహాస్యం చేస్తూ ఈ సాహితి ‘ప్రవరలో ప్రణయ మంత్రాన్ని’ చూపడం శోచనీయమని అన్నారు.

పూర్వకాలంలో బ్రాహ్మణులు నివాసముండే ప్రాంతాలను అగ్రహారాలనేవారని. బ్రాహ్మణులు తాంబూల ప్రియులని, దానిని పట్టుకొని  ‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’ అంటూ మరో ప్రయోగం చేయడం దుస్సాహసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 బ్రాహ్మణులను కించపరిచే విధంగా పాట రాసిన ఈ సాహితి అనబడే శ్రీరామచంద్ర మూర్తి తన తప్పును ఒప్పుకొని బ్రాహ్మణులకు హిందూజాతికి క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్ చేస్తుంది.

No comments:

Post a Comment