Tuesday, August 16, 2016

కృష్ణ పుష్కరాలు

పుష్కరాలలో ఆడంబరాలకు పెద్దపీట
 ఆచారాలకువతిలోదకాలు


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫుష్కరాల నిర్వహణ లో హంగులు ఆర్భటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆచార వ్యవహారలకు ఇవ్వడం లేదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కొ-ఆర్దినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణ పుష్కరాల సందర్భంగ ఆయన సోమవారం విజయవాడ లోని కృష్ణవేణి ఘాట్ లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేసారు. 

ఈ సందర్బంగ అయన మాట్లాడుతూ... పుష్కర స్నానం సమయం లో సంకల్పం చెప్పుకొని స్నానాలు చెయడం సత్ సాంప్రాదాయమని, కాని అక్కడి సిబ్బంది అందుకు బ్రాహ్మణులను నదివద్దకు అనుమతించదం లేదని అన్నారు. 

ఇక పిండ ప్రదానం చెసే ప్రాంతాలలో అక్కడి సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తు చెప్పులెసుకొని ఆ ప్రాంతం లో  బక్తులను తన్నుకుంటూ తిరుగుతున్నారని, ఇది అవమనకరమని అన్నారు, 

ఇక పిండాలను కృష్ణవేణిలో  కలపనీయ కుండా డస్ట్ బిన్ లలొ వెయించడం బాదాకరమని అయన ఆవేదన వ్యక్తం చెశారు.

ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు ఇట్టి విషయమై వేదపండితుల సలహాలను తీసుకొని వారి ఆదేశానుసారం పుష్కర కార్యక్రమాలను నిర్వహించాలని గోగులపాటి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని కోరారు.

Sunday, August 7, 2016

Distribution of Pushkaralu spl T-Shirts

Distribution of Pushkaralu spl T-Shirts









పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం

పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం



పుష్కర పవిత్రతను పరిరక్షిద్దాం..
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు


కృష్ణ పుష్కరాలను పురస్కరించుకొని బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ వాలెంటరీల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా లోహియా గ్రూపు వారు ప్రత్యేకంగా రూపొందించిన టీ షర్టులను కో-ఆర్డినేటర్లు అలూరి, గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు వాలెంటరీలకు  అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉత్సాహవంతులైన యువకులు సేవాకార్యక్రమాలలో పాల్గొని పుష్కరాలను విజయవంతం చేయడానికి ముందుకురావడం ముదాహమని పేర్కొన్నారు. పుష్కరసమయంలో పవిత్ర నదీజలాలు అపవిత్రం కాకుండా చూడాల్సిన భాద్యత మనపై ఎంతోఉందని సూచించారు. 

భక్తులు షాంపూలు, సబ్బులు, బట్టలు ఉతకడాల వలన నీరు కలుషితమయ్యే అవకాశం ఉందని కావున వీటిపై భక్తులకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు.

ముఖ్యంగా పుష్కరాలకు వచ్చే వృద్దులు, పిల్లల పట్ల ప్రత్యేకశ్రద్ద వహించాలని పేర్కొన్నారు. భక్తులు ప్లాస్టిక్ వాడకాలు నిరోదించి పర్యావరణాన్ని కాలుష్యకోరలనుంచి కాపాడి పుష్కర పవిత్రతకు భంగము వాటిల్లకుండా చూసుకోవాల్సిన భాద్యత మనందరి పై ఉందని సూచించారు.

కార్యక్రమంలో బ్రాహ్మిణ్స్ యూనిటీ వాలెంటరీలు, సమూహసభ్యులు పాల్గొన్నారు.