Wednesday, July 12, 2017

పేద బ్రాహ్మణ విద్యార్ధులకు నోటుపుస్తకాల పంపిణి

పేద విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాల అందజేత...

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ చేయూత....

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ తరపున పేద బ్రాహ్మణ విద్యార్ధినీ, విద్యార్ధులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందిద్దామనే యోచనలో ఉన్నాము.

ఇందుకు మి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము.

ఇందుకోసం మేము చెంచల్ గూడా జైల్ అవుట్లెట్ నుండి కొనుగోలుచేసి... పేద విద్యార్ధులకు అందజేస్తున్నాము.

ఈ యజ్ఙం లో మీరు పాల్గొనండి.
ఆసక్తి గలవారు మాతో నేరుగా మీ అభిప్రాయాన్ని పంచుకో గలరని విజ్ఙప్తి.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
9700007653.
గోగులపాటి కృష్ణమోహన్,
ఆలురి,
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

దాతలు
పి. రవిశంకర్, హుబ్లి, 3000/-
సనత్ కుమార్ గారు 2000/-
మృణాళిని 500/-
కృష్ణ చందు 500/-
జనస్వామి సుబ్రహ్మణ్య శర్మ 1116/-
పంచాంగం శివ ప్రసాద్ ఆదిత్య 500/-
గుడిమెట్ల వెంకట కళ్యాణ శ్రీనివాస్ 1000/-
గౌరి, ఆంద్రాబ్యాంక్ 2000/-
ఆజంఖాన్ - 500/-
వెంకటాద్రి,బెంగళూరు 500/-
కోట వీరబద్ర శాస్త్రి 3000/-

పై డబ్బుల ద్వారా సుమారు ఏడువందల నోటుపుస్తకాలను పంచడం జరిగింది.

దాతలకు కృతజ్ఙతలు




బ్రాహ్మణులకు స్వయం ఉపాధిపై అవగాహనా సదస్సు

బ్రాహ్మణులకు స్వయం ఉపాధిపై అవగాహనా సదస్సు
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్




తేది: 09-07-2017
కొత్తపేట, హైదరాబాద్

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - స్వయంఉపాధి అవగాహనా సదస్సులో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ సూచన

ఆదివారం కొత్తపేట న్యూ మారుతీనగర్ లోని భాగ్యనగర్ బ్రాహ్మణ సంఘం లో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ఆద్వర్యంలో  బ్రాహ్మణులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహనా సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు  బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ యువత ఉద్యోగాల వేటలో కాలక్షేపం చేయకుండా స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపి పదిమందికి ఉపాది కల్పించేలా ఎదగాలని కోరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అరోగ్యానికి ఆహార ఉత్పత్తులు అనే అంశంపై సినియర్ సైంటిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్... శ్రీ డా. కె. భాస్కరాచార్య ప్రసంగించారు, 

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెయ ఎమ్. వెంకటేశ్ మాట్లాడుతూ  తమ సంస్థ ద్వరా స్వయం ఉపాధి అవకాశాలు ఎలా పొందాలి అన్నవిషయాలను, ఆన్లైన్ ద్వారా సరఖాస్తు విదానాన్ని వివరించారు.

కుటీరపరిశ్రమల సమస్వయకర్త తోకల శ్రీదేవి, సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రమౌళి లు మాట్లాటుతూ వ్యాపారం పెట్టడంతో పాటు వస్తువులను మార్కెటింగ్ చేయగలిగినప్పుడే అనుకున్న లాభాలు గడిస్తారన్నారు.

చార్టడ్ అకౌంటెంటులు పి. రమణ కుమార్, కె. జయదేవ్ చౌదరి, 
లఘు/ కుటీర పరిశ్రమలను ఏవిధంగా ప్రారంబించుకోవాలో....
ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఏవిధంగా వాటిని సద్వినియోగపరుచుకోవాలో, బ్యాంకులనుండి ఏవిధంగా ఋణసదుపాయాలు పొందాలి అనే విషయాలను  అందుకు కావల్సిన మెలుకువలు సలహాలు సూచనలను అందించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ పిల్లుట్ల అనంద్ మోహన్, బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ యూత్ సర్వీసెస్ వ్యవస్థాపకులు మల్లాది చంద్రమౌళి,  మనబ్రాహ్మణసమాజం ప్రదాన కార్యదర్శి అవధానుల ప్రసాద్, కొన్నేటి శ్రీనివాస్, దుడ్డు సుబ్రహ్మణ్యం, అవధానుల దీక్షిత్  తదితరులు పాల్గొని ప్రసంగించారు.


స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు

బ్రాహ్మణులకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు
తేది: 09-07-2017
వేదిక : భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ, న్యూ మారుతినగర్, కొత్తపేట, హైదరాబాదు 

























బ్రాహ్మణ కులదృవీకరణ అందజేత






బ్రాహ్మణ కులదృవీకరణ అందజేత

తెలంగాణ ప్రబుత్వం బ్రాహ్మణులకు జీవో ఎమ్. ఎస్ నం. 105, ప్రకారం విడుదల చేసిన కుల దృవీకరణ మొదటి పత్రాన్నికుత్భుల్లాపూర్ కు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ బుధవారం స్థానిక ఎమ్మార్వో వి భూపాల్, సూపరిమడెంట్ జనార్ధన్ రావుల చేతులమీదుగా అందుకున్నారు.

ఈ సందర్భంగా బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలకోసం కులదృవీకరణ పత్రం కీలకమని, దానికోసం ఇంతకాలంగా ఎదురుచూశామని అన్నారు.

ఇక బ్రాహ్మణ బందువులంతా ఆలస్యం చేయకుండా కులదృవీకరణకోసం స్థానిక మీ/ఈ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బ్రాహ్మణులకు కులదృవీకరణ అందజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కృషిచేసిన టిబిఎస్పీ చైర్మన్ రమణాచారి గారికి కృతజ్ఙతలు తెలిపారు.

కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రమేష్ సర్వేపల్లి, సంజీవ్ రావు, భరత్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు

Friday, July 7, 2017

స్వయం ఉపాధిపై అవగాహనా సదస్సు - బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు


బ్రాహ్మణ బందువులకు
స్వయం ఉపాధి అవగాహనా సదస్సు
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు
బ్రాహ్మణులు లఘు, కుటీర పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ బ్రాహ్మణ యువతీ, యువకులకు పిలుపునిస్తుంది.
అసలు ఏవిధంగా వ్యాపారం ప్రారంభించాలి, లఘు/కుటీర పరిశ్రమలు ఎలా ప్రారంబించుకోవాలి? ఇందుకు ఎవరిని ఎక్కడ కలవాలి,
ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి, కొటేషన్స్ ఎలా పొందాలి,
బ్యాంకులు ఋణసదుపాయం కల్పించాలంటే  ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ప్రముఖులు, నిపుణులు  మార్గదర్శనం ఇవ్వనున్నారు,
ఈ కార్యక్రమం జూలై 9వ తేదీ ఆదివారం రోజున ఉదయం 11-0 గంటలకు
భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ,  కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా, చివరి బస్టాప్, న్యూ మారుతీ నగర్, కొత్తపేట,
హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాము.
స్వయం ఉపాది అవకాశాల కోసం ఎదురు చుస్తున్నవారు, ఆసక్తి కలవారు, యువతీ యువకులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ ఈ అవగాహనా సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రార్ధన.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
గోగులపాటి కృష్ణమోహన్ 9700007653
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
ఉచిత ప్రవేశం, ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు
రావాలనుకునేవారు వాట్సప్ ద్వారా ముందుగా తెలియజేయ గలరు.
భారత బ్రాహ్మణ సంస్థాన్
సర్వబ్రాహ్మణ పరిషద్,
మనబ్రాహ్మణ సమాజం,
మరియు
బాయ్స్ సంస్థల సహకారంతో....