Friday, June 23, 2017

బ్రాహ్మణులకు కులదృవీకరణ జీవో విడుదల. బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ హర్షం.

బ్రాహ్మణులకు కులదృవీకరణ పత్రాలపై జీవో విడుదల.

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ హర్షం.


తెలంగాణా ప్రాంతంలోని బ్రాహ్మణులందరూ సమీపంలోని ఈ సేవా కేంద్రాలలో బ్రాహ్మణ కుల ధృవీకరణలు పొందేందుకు  దరఖాస్తులు చేసుకోవాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు పిలుపునిచ్చారు.


రాష్ట్రం లోని అన్నికులాలకు ఇచ్చేవిధంగా ఓసీలైన  బ్రాహ్మణులకు కూడా కులదృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం జీఓ విడుదలచేసింది.


ఇప్పటి వరకూ ఈ దృవీకరణ పత్రాలు అందుబాటులో లేక పోవడంతో ఆ ఫలాలు ఎవ్వరూ పొందలేకపొవడంతో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన ఈ జీఓను విడుదల చేసింది.


తెలంగాణా బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషద్ ఫలాలు పొందాలనుకునేవారు సమీప ఈసేవ లో కుల, ఆదాయ, స్థానిక దృవీకరణలు పొంది TBSP ఫలాలు అందుకోవాలని వారు విజ్ఙప్తిచేశారు.


ఈ సందర్భంగా బ్రాహ్మణులకు కూడా కులదృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు జీఓ జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమత్రి కెసీఆర్ గారికి,  అందుకు కృషిచేసిన తెలంగాణా బ్రాహ్మిణ్ సంక్షేమ పరిషద్ చైర్మన్ రమణాచారి గారికి బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్ మోహన్ లు  కృతజ్ఙతలు తెలిపారు.

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కో-ఆర్డినేటర్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
9700007653

No comments:

Post a Comment