దువ్వాడ జగన్నాధం సినిమాలో
నమకం చమకం పదాల తొలగింపు...
దర్శకనిర్మాతల వెల్లడి....
బ్రాహ్మణ సంఘాల హర్షం
నమక చమకాలను మారుస్తాం
డిజె సినిమా దర్శక నిర్మాతల హామీ...
బ్రాహ్మణ సంఘాల హర్షం
గత కొద్దిరోజులుగా దువ్వాడ జగన్నాథం సినిమా లో నమక చమకాలు, ప్రవర, అగ్రహారాల పదప్రయోగాలతో రాసిన గీతంపై పలు బ్రాహ్మణ సంఘాలు ఆందోళనలకుదిగిన విషయం అందరికీ విదితమే....
ఈ విషయమై బ్రాహ్మణ సంఘం నేతలు సోమవారం డిజె సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ను, గేయ రచయుత సాహితిని వారి కార్యాలయంలోకలిశారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘనేతలు నమక చమకాల ప్రాశస్త్యాన్ని వివరించి ఆ పదాలను తొలగించాల్సిందిగా డిమాండ్ చేశారు.
చర్చల అనంతరం దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ దిల్ రాజులు స్పందిస్తూ... ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో పాటను రాయలేదని... అయినప్పటికీ పండితుల, బ్రాహ్మణ సంఘాలకోరిక మేరకు నమకం, చమకం అనే పదాలను తొలగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణసంఘం నాయకులు మాట్లాడుతూ తమ కోరికమేరకు దువ్వాడ జగన్నాధం సినిమా లో పాటలో మార్పులకు, చేర్పులకు అంగీకరించినందుకు డిజె సినిమా దర్శక నిర్మాతలకు, గేయరచయుతకు తమ కృతజ్ఙతలు తెలియజేశారు.
ఇకముందు ఏ సినిమా దర్శక నిర్మాతలైనా హిందువుల, బ్రాహ్మణుల మనోభావాలను సెబ్బతీసేలా సినిమాలు తీయకూడదని విజ్ఙప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు ద్రోణంరాజు రవికుమార్, తులసి శ్రీనివాస్, గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, సుబ్బూజీ ప్రబృతులు పాల్గొన్నారు.





No comments:
Post a Comment