Friday, June 24, 2016

బ్రాహ్మణ సినిమా పేరు మార్చండి

బ్రాహ్మణ సినిమా పేరు మార్చండి

శ్రీయుత గౌరవనీయులైన
బి. వీర శంకర్
చలనచిత్ర దర్శకుల సంఘం  అధ్యక్షులు గారికి...

విషయము : చలనచిత్రాలలో బ్రాహ్మణులను కించపరచుట గూర్చి ఫిర్యాదు.

ఆర్యా!

ఇటివల సినిమాలు, సీరియల్స్ లలో బ్రాహ్మణులను కించపరుస్తూ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా బ్రాహ్మణుల వేషబాషలతో పరియాచకాలు ఆడుతూ బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తూ బాపనయ్య, పంతులయ్య అంటూ అపహాస్యం చేస్తున్నారు.

మరికొన్ని చిత్రాలలో బ్రాహ్మణులు మద్యం సేవిస్తూ, మాంసాహారాన్ని బుజిస్తున్నట్టుగా చూపిస్తున్నారు.
బ్రాహ్మణులు ఉచ్చరించే మంత్రాలను సైతం ఏదో ఇష్టం వచ్చినట్టు పలుకుతూ పరువుతీస్తున్నారు.
ఇక బ్రాహ్మణ స్త్రీలను అసభ్యంగా చూపిస్తూ  మహిళలను చులకన చేస్తున్నారు.

దీనివలన బ్రాహ్మణుల మనోబావాలు దెబ్బతినడమే కాకుండా... వారిని మానసికంగా బాదిస్తున్నారు.
కావున ఇకనుండి సినిమాలలో బ్రాహ్మణులకు సముచిత గౌరవమిస్తూ బ్రాహ్మణ కులంతో హాస్యాలు ఆడకుండా మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను రంజింపజేయాలని కోరుకుంటున్నాము.

ఇట్లు
ఆలూరి, గోగులపాటి కృష్ణమోహన్,  పిల్లుట్ల ఆనంద్ మోహన్.
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మణ్స్ యూనిటీ ఫరెవర్

Friday, June 10, 2016

కంచ ఐలయ్యపై మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు

కంచ ఐలయ్యపై మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు

🙏🏼మీడియా మిత్రులకు🙏🏼

 యాంకర్ పార్ట్ : హిందుత్వాన్ని... అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ  అవమానపరుస్తున్న కంచ ఐలయ్య షెపార్డ్ పై చట్ట రీత్యా చర్య కొరకు  బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిజిపి మరియు మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు...

 మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యునివర్సిటి, సి ఎస్ ఎస్ ఇ పి డైరక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న కంచ ఐలయ్య షెపర్డ్  బాద్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా ప్రపంచానికే గర్వకారణమైన హిందు సంస్కృతి  సాంప్రాదాయాలను, అనాదిగా వాటిని పరిరక్షిస్తూ వస్తున్న బ్రాహ్మణులపై మానసిక, సామాజిక దాడులకు పాల్పడుతూ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేస్తూ పత్రికలలో వ్యాసాలు రాస్తూ హిందువుల...అందులో ముఖ్యంగా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని బ్రాహ్మణ్స్ యూనిటి ఫరెవర్ సభ్యులు ఆవేశం వ్యక్తం చేశారు.

 పత్రికల్లో, టీవీలలో నోటికొచ్చినట్టు వాగుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కలసి మెలసి ఉన్న కులాల మద్య చిచ్చు పెట్టి భారతదేశ సంస్కృతి సాంప్రదాయలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని వారన్నారు.

అతను బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యానాలకు సంబందించిన పత్రికా ప్రచురణలను  జత పరుస్తున్నా

ఇతని ప్రవర్తనలో మార్పు రాకుంటే రాష్ట్రంలో కులఘర్షనలు జరిగే ప్రమాదం పొంచిఉందని పేర్కొన్నారు.

కావున తక్షణమే హిందూ మరియు బ్రాహ్మణద్వేషి అయిన కంచ ఐలయ్య షెపర్డ్ అనే వ్యక్తి పై చట్టరీత్యా తగు చర్యలు చేపట్టి రాష్ట్రంలో శాంతి బద్రతలకు అఘాతం కలగకుండా చూసి బ్రాహ్మణులకు బద్రత కల్పించాలని డిజిపి మరియు మానవ హక్కుల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డిజీపి, మానవ హక్కుల కమీషన్ ను కలసినవారిలో... బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ గోగులపాటి కృష్ణమోహన్, అలూరి, సలహాదారులు ద్రోణంరాజు రవికిమార్, మల్లాది చంద్రమౌళి, భాగ్యనగర్ అర్చక సంఘం అధ్యక్షులు శ్రనివాసాచార్యులు, వింజమూరి రామకృష్ణ శర్మ, మురళీధర్ శర్మ, సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కో-ఆర్డినేటర్ 
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

కంచ ఐలయ్యపై డిజిపి కి ఫిర్యాదు

Saturday, June 4, 2016

వేదపండితుడు గిరీష్ కులకర్ణికి మద్దతు

వేదపండితుడు గిరీష్ కులకర్ణికి మద్దతు

చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ వేదపండితుడు గిరీష్ కులకర్ణి కుటుంబానికి న్యాయం చేయాలని బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ ఆద్వర్యంలో డిమాండ్ చేశారు. 

ఆలయ దర్మకర్త రాజేంద్రనాధ్ గౌడ్ తరచూ వేదింపులకు పాల్పడడంతో గిరీష్ కులకర్ణి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు  నగరంలోని పలు బ్రాహ్మణసంఘాలు శుక్రవారం వెంకటేశ్వరస్వామి దేవాలయం ముందు దర్నా చేపట్టారు. 

ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ...
ఆలయ దర్మకర్త వేదపండితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, గుడిలో వైదిక్ కమిటీ ఉన్నప్పటికీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యొగులపట్ల అమానుషంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. 

గుడిలో పనిచేస్తున్న సిబ్బందికి గత ఐదు సంవత్సరాలుగా డి. ఏ. కూడా ఇవ్వకుండా నిలిపివేశారని సిబ్బంది వాపోయారు. 

ఆలయ చైర్మన్ దేవాలయ స్థలాన్ని ఖబ్జా చేసినా పట్టించుకునే నాధుడే లేడని వారన్నారు. 

అన్నివిషయాలు తెలిసికూడా ఆలయ ఇ. ఓ మిన్నకుండ ఉంటున్నారని వారు తెలిపారు.

ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి అనారోగ్యానికి గురైన గిరీష్ కులకర్ణి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు.... సిబ్బందికి రావాల్సిన బత్యాలను వెంటనే ఇప్పించాలని లెదంటే తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం గిరీష్ సతీమణి అపర్ణ కులకర్ణి  మల్లాది చంద్రమౌలి ఆద్వర్యంలో చిక్కడపల్లి పోలీసులకు, మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణసంఘం నాయకులు మల్లాది చంద్రమౌళి, ద్రోణంరాజు రవికుమార్, గంగు భానుమూర్తి, సుధాకర్ శర్మ, బ్రాహ్మణ్స్ యూనిటి ఫరెవర్ కోఆర్డినేటర్లు అల్లూరి, కృష్ణమోహన్, ఆనందమోహన్, ఆలయ అర్చకులు వరదాచార్యులు, శ్రీనివాసా చార్యులు, సిబ్బంది, బ్రాహ్మణసంఘం నాయకులు మరియు బాదితుని కుటుంబ సభ్యులు బందువులు పాల్గొన్నారు.