Friday, June 23, 2017

డిజె సినిమా పై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు.బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

డిజె సినిమా పై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు
పదాలు మార్చామని సిఐతో దర్శకనిర్మాతల వెల్లడి.





డిజె సినిమా పై దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు
పదాలు మార్చామని సిఐతో దర్శకనిర్మాతల వెల్లడి.

డిజె (దువ్వాడ జగన్నాధం) సినిమాలో బడిలో గుడిలో పాటలో అభ్యంతర కరమైన పదాలు తొలగిస్తామని మాట తప్పిన విషయం
మరియు
శివార్చన కొరకు వాడే నమకచమకాలను ప్రేయసి అంగాంగ బంగిమలను వర్ణిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గానూ దుండిగల్ పోలీసు స్టేషన్లో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు.

దీనిపై దుండిగల్ సి ఐ శంకరయ్య సినీ దర్శక నిర్మాతలతో ఫోనులో సంభాషించి వివరణకోరగా. అందుకు అందుకు దర్శకనిర్మాతలు హరీష్ శంకర్, దిల్ రాజులు స్పందిస్తూ ఆడియో విడుదల నాటికి వాటిని మార్చలేకపోయామని, ప్రస్రుతం అవి మార్చినట్టు తెలిపారు.

ఈ విషయాన్ని సిఐ గోగులపాటి కృష్ణమోహన్ కు వివరించారు.

ఆడియో విడుదలకు ముందే ఈ పని చేసి ఉంటే బాగుండేదని, ఇప్పుడు చేయడం వలన విడుదల అయిన ఆడియోల పరిస్థతి ఏంటని ప్రశ్నించారు.


ఈ కార్యక్రమం లో గోగులపాటి కృష్ణమోహన్ తో పాటు వెలిచేటి కృష్ణప్రసాద్, నాగమోహన్, పాపయ్య శాస్త్రి, సంజీవరావు, మూర్తి, మల్లేశ్వరశాస్త్రి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment