Sunday, February 11, 2018

గోగినేనీ... గోల తగ్గించు... గోగులపాటి కృష్ణమోహన్ సూచన

http://telanganareporter.news/గోగినేనీ-గోల-తగ్గించు/

*గోగినేనీ... గోల తగ్గించు...* 

ఇటీవల కొన్ని ఛానల్స్ లో అతిధిగా పాల్గొంటూ మూఢనమ్మకాల పేరుతో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కించపరుస్తున్న గోగినేని బాబు తన తీరుమార్చుకోవాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ హెచ్చరించారు.

టీవీలలో తానే మేధావిననే భావంతో వితంఢవాదం చేస్తూ వాస్తవాలను అవాస్తవాలుగా, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని కృష్ణమోహన్ ఆరోపించారు.

తన సైన్స్ పరిజ్ఙానంతో పంచభూతాలను, జీవాజాలని పుట్టించగలడా అని కృష్ణమోహన్ ప్రశ్నించారు.

ఎక్కడో, ఎవరో మాయమాటలతో మోసం చేస్తున్నారని అన్నిటినీ మాయ, మోసం అనడం తగదని హితువుపలికారు.

వాస్తవాలన్నింటినీ చూడలేమని, చూసేవన్నీ వాస్తవాలు కావని... నీ ఎదురుగా ఉన్న గాలినే నీవు చూడలేనివాడివి దేవుడిని ఎలా చూడగలవని ప్రశ్నించారు. నీ తండ్రి అని నీ తల్లిచెబితే తప్ప నీకు నీ తండ్రెవరో తెలియదని, అంతమాత్రాన అది వాస్తవం కాకుండా పోదని,  ఇలాంటి వాస్తవాలు గోగినేని తెలుసుకోవాలని, కొన్నిటిని నమ్మకతప్పదని హితువు పలికారు.

ఇకనుండి ఛానల్స్ లో పాల్గొని  నాన్సెన్స్, నాన్సెన్స్ అంటూ న్యూసెన్స్ చేయడం మానుకోవాలని, పెద్దలపట్ల గౌరవంగా నడుచుకోవడం నేర్చుకోవాలని కృష్ణమోహన్ గోగినేనికి సూచించారు.

హిందుత్వం అనేది ఒకమతంలా కాకుండా అదొక జీవనవిధానంగా చూడాలని ఆయన అన్నారు. 

జ్యోతిష్యం, పంచాంగాలతోపాటు హిందువుల ఆచారవ్యవహారాల జోలికి రాకుండా ఉంటే మంచిదని కృష్ణమోహన్ పేర్కొన్నారు.

ఛానల్స్ వారు కూడా తమ టిఆర్పి రేట్ పెంచుకోవడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాంటి కార్యక్రమాలను ప్రసారం చేయకుండా ఉంటే ఎంతో గౌరవంగా ఉంటుందని గోగులపాటి కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.


No comments:

Post a Comment