Thursday, March 29, 2018

విడుదలకు నోచుకోని బ్రాహ్మణ పరిషద్ నిధులు - మూల్గుతున్న మూడొందల కోట్లు



మూడొందల కోట్లున్నా ప్రారంభం కాని పలు పథకాలు...  నిరాశ నిస్పృహ లో పేద బ్రాహ్మణులు...


 పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంవత్సరానికి వందకోట్ల నిధులు మంజూరు చేసినప్పటికి అవి ఇంకా మంజూరుకు నోచుకోకపోవడం బాధాకరమని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్  కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

పేద బ్రాహణులు ఇప్పటికే వ్యాపారాల కోసం, పిల్లల విదేశీ చదువులకోసం ఎన్నో ఆశలతో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటివరకు వారికి ఎలాంటి సహాయం అందకపోగా కనీసం ఎప్పటివరకు అందుతాయోకూడా తెలియక అయోమయం ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యని విధంగా తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషద్ నిధుల దుస్థితి ఉందని కృష్ణమోహన్ తెలిపారు.

హెల్త్ ఇన్సూరెన్సు కార్డులు కొంతమందికి ఇచ్చారని, ఇలాగే ఇతర సంక్షేమ పథకాలు కూడా పేద బ్రాహణులందరికీ చేరే విధంగా త్వరతిగతిన పరిషద్ సభ్యులు, సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఙప్తి చేశారు.


No comments:

Post a Comment