https://youtu.be/6T3j_TQtPGc
అభ్యంతరాలు ఉంటే సహించేదు లేదు
ఆచారి అమేరికా యాత్ర సినిమా యూనిట్ కు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ హెచ్చరిక
పద్మజా పిక్చర్స్ పతాకంపై జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలోమంచు విష్ణు హీరోగా వస్తున్న కొత్త సినిమా 'ఆచారి అమెరికా యాత్ర' లో బ్రాహ్మణులను కించపరిచే లేదా మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉంటే సహించేదిలేదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ తీవ్రంగా హెచ్చరించింది.
ఇటీవల సినిమాలు ఏదో కులాన్ని, వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీస్తున్నారని, సినిమాలు వినోదాత్మకంగా ఉండాలే తప్ప వివాదస్పదంగా మారకూడదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆచారి అమేరికా యాత్ర వినోదాత్మకంగా ఉంటే పర్వాలేదని... బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా ఉండకుండా సెన్సార్ బోర్డు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పత్రికాముఖంగా పేర్కొన్నారు.

No comments:
Post a Comment