సి. యం కేసీఆర్ కు కృతజ్ఙతలు
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన కుచనపల్లి శంకర్ శర్మ బ్లడ్ క్యాన్సర్ తో ఆర్ధిక ఇబ్బందితో యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు త్వరతిగతిన స్పందించి 1500000/- (పదిహేను లక్షలు) మంజూరు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సోమాజీగూడ లోని ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం నిర్వహించి సి. యం గారికి కృతజ్ఙతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్ ఫర్ యూత్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు మల్లది చంద్రమౌళి, మనబ్రాహ్మణ సమాజం ప్ర. కా. అవధానుల నర్సింహ్మ ప్రసాద్, వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ప్ర. కా. కొన్నేటి శ్రీనివాస్, బాలానగర్ కార్పోరేటర్ నరేంద్రాచారి మరియు బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment