Monday, March 20, 2017

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ (B2B Help)

బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ (B2B Help)

నమస్కారం
B2b Help  కాన్సెప్ట్ అంటే బ్రాహ్మిణ్ టు బ్రాహ్మిణ్ హెల్ప్ అనే నినాదంతో ఏర్పాటైన "బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్" స్థాపించిన అనతికాలంలోనే చేపట్టిన కార్యక్రమాల వివరాలు

>గ్రూపు ప్రారంభించిన అనతి కాలంలోనే మూడవేలమంది సభ్యులచే పన్నెండు వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసుకోవడం మొదటి విజయం. (అందరూ అడ్మిన్ లే)
>అన్ని బ్రాహ్మణ సంఘ నాయకులను ఒకేవేదిక మీదకు తెచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
>ముఖ్యంగా పేద బ్రాహ్మణులను ఆదుకోవడం,
>బ్రాహ్మణ విద్యార్ధిని విద్యార్ధులకు విద్యా, ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడానికి కృషి.
>నల్లకుంటలోని బ్రాహ్మణ వసతిగృహం సందర్శన.
వసతులపై ఆరా, సహాయం కొరకు హామీ.
>చిక్కడపల్లి లోని వెంకటేశ్వర దేవాలయంలో పనిచేస్తున్న ఋఉగ్వేద పండితుడిపై ఆలయ దర్మకర్త గిరీష్ కులకర్ణికి మద్దతుగా ఆలయం ముందు దర్నా.
>కులాల మద్య చిచ్చు పెడుతున్న కంచ ఐలయ్య పై డిజిపి అన్రాగ్ శర్మకు ఫిర్యాదు.
>ఉర్ధూ విశ్వవిద్యాలయంలో ఓ విభాగానికి డైరెక్టర్ గా పనిచేస్తున్న కంచ ఐలయ్య భాద్యత మరిచి కుల, మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడని మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు.
>బ్రాహ్మణ విద్యార్దినికి ప్రైవేటు పాఠశాల లో విద్య కొరకు దాత ద్వార ఇరువై వేలరూపాయల ఆర్ధిక  అందజేత.
>ఇంజనీరింగ్ పూర్తైన బ్రాహ్మణ విద్యార్ధులకు ఉపాధి అవకాశం కల్పించడం కోసం ఐటి కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు.
>ఇంటర్, డిగ్రి, పిజి విద్యార్ధులకు  ఉచితవిద్యావకాశం కల్పించడం.
>ఎం. కాం., ఎం.బి.ఏ., ,బి. ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాల కల్పన.
>టీవీ సీరియల్స్, సినిమాలలో బ్రాహ్మణులను కించపరుస్తూ సన్నివేశాలను చిత్రీకరించడం మానుకోవాలంటూ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అద్యక్షునికి వినతి పత్రం సమర్పణ.
>కుత్భుల్లాపూర్ ఆత్మహత్యకు గురైన పేద బ్రాహ్మణునికి న్యాయంజరిగేవరకు పోరాటం.
>గీతాయజ్ఙంలో బాగంగా ఉచితంగా భగవద్గీత పుస్తకాల వితరణ.

ముఖ్యంగా BUF
*బ్రాహ్మణులు విద్య, వైద్య ఖర్చుల విషయంలో ఇబ్బందిపడుతున్నవారికి ఆర్దికంగా చేయూత,

*ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పన,

*బ్రాహ్మణుల ఉనికి, ఉజ్వలభవిష్యత్తు కోసం పోరాటం,

*సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ,


చేపట్టనున్న కార్యక్రమాలు
~~~~~~~~~~~~~~

* జిల్లాలవారిగా విద్యార్ధిని విద్యార్ధులకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయడం.

* బ్రాహ్మణులకు రిజర్వేషన్ల లో జరుగుతున్న అన్యాయాలపై అవగాహనా సదస్సులు ఏర్పాటు. బిపిఎల్ ఆదారంగా రిజర్వేషన్ల ఏర్పాటుకై పోరాటం.

* ఆర్ధిక అసమానతల నిర్మూలనకై పోరాటం. ఇతర సామాజిక సంఘాల సహాయ సహకారాలకోసం కృషి.

* గ్రామాల వారిగా బ్రాహ్మణుల జాబితా రూపకల్పనకు కృషి.

* అన్ని బ్రాహ్మణ సంఘాల సంఘటితానికి కృషి.

* దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న బ్రాజ్మణ కుటుంబాలకు ఉచిత అరోగ్యభిమా కార్డులు, పిల్లల చదువుకు అయ్యే ఖర్చులు తెలంగాణా బ్రాహ్మిణ్ సంక్షేమ పరషద్ భరించాలని డిమాండ్  చేస్తూ.....
ఇందుకు మీ అందరి సహాయసహకారాలను ఆర్ధిస్తూ..


మీ
గోగులపాటి కృష్ణమోహన్ : 9700007653
ఆలూరి : 9618300709
ఆనంద్ మోహన్‌ : 8519993339
కో-ఆర్డనేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్

No comments:

Post a Comment