Wednesday, September 21, 2016

బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య





బ్రాహ్మణ యువకుడు ఆత్మహత్య

వివాహిత స్త్రీ ని వేదిస్తున్నాడన్న నెపంతో భవానీ మాలలో ఉన్న బ్రాహ్మణ యువకుడిపై స్థానికులు  దుర్భాషలాడుతూ దాడిచేయడంతో మనస్థాపానికి గురై ఇంట్లొ ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పేట్ బషీరాబాద్ : పేట్ బషీరాబాద్ పి.యస్ పరిదిలోని పద్మారావు నగర్ ఫేస్ 2 లో నారాయణ క్షేత్రం లో పూజారిగా విధులు నిర్వహిస్తున్న "వడపల్లి భాస్కర కృష్ణ స్వరూప్ (25) కాలని పెద్దలు అవమానించారని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..తండ్రి ఇచ్చిన ఫిర్యాధు మేరకు కాలని పెద్దల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు
విషయం తెలుసుకున్న వెంటనే గ్రేటర్ హైదరాబాద్ అర్చకసంఘం నాయకులు శ్రీకాంత్ శర్మ స్థానిక అర్చకసంఘం నాయకులు పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేయించారు.

మృతుని కుటుంబానికి న్యాయం జరిగేందుకు శవాన్ని నిందితులో ముఖ్యుడికి చెందిన పాఠశాలముందు పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

కార్యక్రమంలో బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ 
గోగులపాటి కృష్ణమోహన్, పిల్లుట్ల ఆనంద్ మోహన్, భాగ్యనగర అర్చకసంఘం అద్యక్షులు శ్రీనివాసాచార్యులు కుత్భుల్లాపూర్ అర్చకసంఘం సభ్యులు, ఇతర బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment