Tuesday, August 16, 2016

కృష్ణ పుష్కరాలు

పుష్కరాలలో ఆడంబరాలకు పెద్దపీట
 ఆచారాలకువతిలోదకాలు


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫుష్కరాల నిర్వహణ లో హంగులు ఆర్భటాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆచార వ్యవహారలకు ఇవ్వడం లేదని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కొ-ఆర్దినేటర్ గోగులపాటి కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణ పుష్కరాల సందర్భంగ ఆయన సోమవారం విజయవాడ లోని కృష్ణవేణి ఘాట్ లో కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేసారు. 

ఈ సందర్బంగ అయన మాట్లాడుతూ... పుష్కర స్నానం సమయం లో సంకల్పం చెప్పుకొని స్నానాలు చెయడం సత్ సాంప్రాదాయమని, కాని అక్కడి సిబ్బంది అందుకు బ్రాహ్మణులను నదివద్దకు అనుమతించదం లేదని అన్నారు. 

ఇక పిండ ప్రదానం చెసే ప్రాంతాలలో అక్కడి సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తు చెప్పులెసుకొని ఆ ప్రాంతం లో  బక్తులను తన్నుకుంటూ తిరుగుతున్నారని, ఇది అవమనకరమని అన్నారు, 

ఇక పిండాలను కృష్ణవేణిలో  కలపనీయ కుండా డస్ట్ బిన్ లలొ వెయించడం బాదాకరమని అయన ఆవేదన వ్యక్తం చెశారు.

ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు ఇట్టి విషయమై వేదపండితుల సలహాలను తీసుకొని వారి ఆదేశానుసారం పుష్కర కార్యక్రమాలను నిర్వహించాలని గోగులపాటి కృష్ణమోహన్ ప్రభుత్వాన్ని కోరారు.

No comments:

Post a Comment