Friday, June 10, 2016

కంచ ఐలయ్యపై డిజిపి కి ఫిర్యాదు

కంచ ఐలయ్యపై డిజిపి కి ఫిర్యాదు





 యాంకర్ పార్ట్ : హిందుత్వాన్ని... అందులో ప్రత్యేకంగా బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ  అవమానపరుస్తున్న కంచ ఐలయ్య షెపార్డ్ పై చట్ట రీత్యా చర్య కొరకు  బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిజిపి మరియు మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు...


 మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యునివర్సిటి, సి ఎస్ ఎస్ ఇ పి డైరక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న కంచ ఐలయ్య షెపర్డ్  బాద్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ బాధ్యతారహితంగా ప్రపంచానికే గర్వకారణమైన హిందు సంస్కృతి  సాంప్రాదాయాలను, అనాదిగా వాటిని పరిరక్షిస్తూ వస్తున్న బ్రాహ్మణులపై మానసిక, సామాజిక దాడులకు పాల్పడుతూ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేస్తూ పత్రికలలో వ్యాసాలు రాస్తూ హిందువుల...అందులో ముఖ్యంగా బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని బ్రాహ్మణ్స్ యూనిటి ఫరెవర్ సభ్యులు ఆవేశం వ్యక్తం చేశారు.

 పత్రికల్లో, టీవీలలో నోటికొచ్చినట్టు వాగుతూ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కలసి మెలసి ఉన్న కులాల మద్య చిచ్చు పెట్టి భారతదేశ సంస్కృతి సాంప్రదాయలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని వారన్నారు.

అతను బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యానాలకు సంబందించిన పత్రికా ప్రచురణలను  జత పరుస్తున్నా

ఇతని ప్రవర్తనలో మార్పు రాకుంటే రాష్ట్రంలో కులఘర్షనలు జరిగే ప్రమాదం పొంచిఉందని పేర్కొన్నారు.

కావున తక్షణమే హిందూ మరియు బ్రాహ్మణద్వేషి అయిన కంచ ఐలయ్య షెపర్డ్ అనే వ్యక్తి పై చట్టరీత్యా తగు చర్యలు చేపట్టి రాష్ట్రంలో శాంతి బద్రతలకు అఘాతం కలగకుండా చూసి బ్రాహ్మణులకు బద్రత కల్పించాలని డిజిపి మరియు మానవ హక్కుల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డిజీపి, మానవ హక్కుల కమీషన్ ను కలసినవారిలో... బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ కో-ఆర్డినేటర్స్ గోగులపాటి కృష్ణమోహన్, అలూరి, సలహాదారులు ద్రోణంరాజు రవికిమార్, మల్లాది చంద్రమౌళి, భాగ్యనగర్ అర్చక సంఘం అధ్యక్షులు శ్రనివాసాచార్యులు, వింజమూరి రామకృష్ణ శర్మ, మురళీధర్ శర్మ, సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు

ఇట్లు
గోగులపాటి కృష్ణమోహన్
కో-ఆర్డినేటర్ 
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్

No comments:

Post a Comment