వేదపండితుడు గిరీష్ కులకర్ణికి మద్దతు
చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ వేదపండితుడు గిరీష్ కులకర్ణి కుటుంబానికి న్యాయం చేయాలని బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మిణ్స్ యూనిటి ఫరెవర్ ఆద్వర్యంలో డిమాండ్ చేశారు.
ఆలయ దర్మకర్త రాజేంద్రనాధ్ గౌడ్ తరచూ వేదింపులకు పాల్పడడంతో గిరీష్ కులకర్ణి గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు నగరంలోని పలు బ్రాహ్మణసంఘాలు శుక్రవారం వెంకటేశ్వరస్వామి దేవాలయం ముందు దర్నా చేపట్టారు.
ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ...
ఆలయ దర్మకర్త వేదపండితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, గుడిలో వైదిక్ కమిటీ ఉన్నప్పటికీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యొగులపట్ల అమానుషంగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.
గుడిలో పనిచేస్తున్న సిబ్బందికి గత ఐదు సంవత్సరాలుగా డి. ఏ. కూడా ఇవ్వకుండా నిలిపివేశారని సిబ్బంది వాపోయారు.
ఆలయ చైర్మన్ దేవాలయ స్థలాన్ని ఖబ్జా చేసినా పట్టించుకునే నాధుడే లేడని వారన్నారు.
అన్నివిషయాలు తెలిసికూడా ఆలయ ఇ. ఓ మిన్నకుండ ఉంటున్నారని వారు తెలిపారు.
ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి అనారోగ్యానికి గురైన గిరీష్ కులకర్ణి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు.... సిబ్బందికి రావాల్సిన బత్యాలను వెంటనే ఇప్పించాలని లెదంటే తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం గిరీష్ సతీమణి అపర్ణ కులకర్ణి మల్లాది చంద్రమౌలి ఆద్వర్యంలో చిక్కడపల్లి పోలీసులకు, మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణసంఘం నాయకులు మల్లాది చంద్రమౌళి, ద్రోణంరాజు రవికుమార్, గంగు భానుమూర్తి, సుధాకర్ శర్మ, బ్రాహ్మణ్స్ యూనిటి ఫరెవర్ కోఆర్డినేటర్లు అల్లూరి, కృష్ణమోహన్, ఆనందమోహన్, ఆలయ అర్చకులు వరదాచార్యులు, శ్రీనివాసా చార్యులు, సిబ్బంది, బ్రాహ్మణసంఘం నాయకులు మరియు బాదితుని కుటుంబ సభ్యులు బందువులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment