Friday, July 7, 2017

స్వయం ఉపాధిపై అవగాహనా సదస్సు - బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు


బ్రాహ్మణ బందువులకు
స్వయం ఉపాధి అవగాహనా సదస్సు
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ పిలుపు
బ్రాహ్మణులు లఘు, కుటీర పరిశ్రమల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ బ్రాహ్మణ యువతీ, యువకులకు పిలుపునిస్తుంది.
అసలు ఏవిధంగా వ్యాపారం ప్రారంభించాలి, లఘు/కుటీర పరిశ్రమలు ఎలా ప్రారంబించుకోవాలి? ఇందుకు ఎవరిని ఎక్కడ కలవాలి,
ప్రాజెక్టు రిపోర్ట్స్ ఎలా తయారు చేయాలి, కొటేషన్స్ ఎలా పొందాలి,
బ్యాంకులు ఋణసదుపాయం కల్పించాలంటే  ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ప్రముఖులు, నిపుణులు  మార్గదర్శనం ఇవ్వనున్నారు,
ఈ కార్యక్రమం జూలై 9వ తేదీ ఆదివారం రోజున ఉదయం 11-0 గంటలకు
భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ,  కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా, చివరి బస్టాప్, న్యూ మారుతీ నగర్, కొత్తపేట,
హైదరాబాద్ లో నిర్వహిస్తున్నాము.
స్వయం ఉపాది అవకాశాల కోసం ఎదురు చుస్తున్నవారు, ఆసక్తి కలవారు, యువతీ యువకులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ ఈ అవగాహనా సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రార్ధన.
మరిన్ని వివరాలకు సంప్రదించండి
గోగులపాటి కృష్ణమోహన్ 9700007653
ఆలూరి
పిల్లుట్ల ఆనంద్ మోహన్
కో-ఆర్డినేటర్స్
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్
ఉచిత ప్రవేశం, ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు
రావాలనుకునేవారు వాట్సప్ ద్వారా ముందుగా తెలియజేయ గలరు.
భారత బ్రాహ్మణ సంస్థాన్
సర్వబ్రాహ్మణ పరిషద్,
మనబ్రాహ్మణ సమాజం,
మరియు
బాయ్స్ సంస్థల సహకారంతో....

No comments:

Post a Comment